సర్కార్ టీచర్లకు ఐడీ కార్డులు - Unmasp - experience exhibiting blog

Post Top Ad

Post Top Ad

సర్కార్ టీచర్లకు ఐడీ కార్డులు

 

సర్కార్ టీచర్లకు ఐడీ కార్డులు

Posted on 

  • స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని వారికి ఇవ్వాలని నిర్ణయం
  •  ఈ నెల 30 వరకు డిటెయిల్స్ అప్ డేట్ కు అవకాశం

రాష్ర్టంలోని సర్కార్ స్కూళ్ల టీచరకు ఈ ఏడాది ఐడెంటిటీ కార్డులు జారీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. దీనికోసం టీచర నుంచి మరోసారి వివరాలు సేకరిస్తున్నారు. పోయినేడాది టీచర్ ఇన్ఫోలో వారిచ్చిన డిటెయిల్స్ ను అప్డేట్ చేస్తూ, కొత్తగా మరికొన్ని వివరాలను ఈ నెల30 లోగా యాడ్ చేయాలని అధి కారులు సూచించారు. రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1.25 లక్షలకు పైగా టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో లోకల్ బాడీ, గవర్నమెంట్ స్కూళ్ల టీచర్లు 1.15 లక్షల మంది ఉండగా.. మిగిలిన వారంతా కేజీబీవీ, మోడల్ స్కూల్స్, టీఆర్ఈఐఎస్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్(యూఆర్ఎస్) తదితర వాటిల్లో పని చేస్తున్నారు. ఇప్పటివరకు టీచర్లకు ప్రభుత్వం గానీ, విద్యాశాఖ గానీ ఐడీ కార్డులు ఇవ్వలేదు. కొన్ని స్కూళలో టీచర్లే సొంత డబ్బులు వేసుకొని, గుర్తింపు కార్డులు తయారు చేయించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది టీచరకు అధికారికంగా ఐడీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పోయినేడాదే ఎస్ఎస్ఏ ఓకే…

టీచర్లకు ఐడీ కార్డులు ఇచ్చేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) పోయినేడాదే ఓకే చెప్పింది. కానీ ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో, లాస్ట్ ఇయర్ ఐడీ కార్డులు ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. చైల్డ్ ఇన్ఫో ద్వారా పిల్ల ల వివరాలు సేకరిస్తుండగా, రెండేండ్లనుంచి టీచర్స్ ఇన్ఫో ద్వారా వాళ్ళ డిటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ నెల30 వరకు schooledu.telangana.gov. in/ISMS వెబ్ సైట్ ద్వారా డిటెయిల్స్ ను అప్డేట్ చేసుకోవాలని అధికారులు టీచర్లకు సూచించారు. కొత్తగా టీచర్ల బ్లడ్ గ్రూప్, ఆధార్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు సేకరిస్తున్నారు. ‘‘ఐడీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. ఐడీ కార్డు ఎలా ఉండాలి? అందులో ఏఏ వివరాలు ఉండాలి? ఎప్పుటి లోపు ఇవ్వాలి? తదితర అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు” అని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎస్ఎస్ఏ పరిధిలో పని చేస్తున్నకాంట్రాక్టు సిబ్బందికి కూడా అధికారికంగా ఐడీ కార్డులు ఇవ్వా లని కోరుతున్నారు.

Related Posts

No comments:

Post a Comment

Post Bottom Ad